PM MITRA: టెక్స్‌టైల్ రంగం అభివృద్ధి ప‌రుగులు..! 5 d ago

featured-image

దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం. ఉద్యోగాలను సృష్టించాలన్న ఉద్దేశ్యంతో ఏడు మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ ఆపరెల్ (PM MITRA) పార్కులను ఏర్పాటు చేసేందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది.

PM MITRA గ్రీన్ ఫీల్డ్ పార్కులు ఏర్పాటు చేసే ప్రదేశాలు

  • విరుదునగర్-గ్రీన్ ఫీల్డ్ (తమిళనాడు)
  • నవసరి- గ్రీన్ ఫీల్డ్ (గుజరాత్)
  • కలబురగి- గ్రీన్ ఫీల్డ్ (కర్ణాటక)
  • ధార్- గ్రీన్ ఫీల్డ్ (మధ్యప్రదేశ్)
  • లక్నో- గ్రీన్ ఫీల్డ్ (ఉత్తరప్రదేశ్)
  • వరంగల్-బ్రౌన్ ఫీల్డ్ (తెలంగాణ)
  • అమరావతి- బ్రౌన్ ఫీల్డ్ (మహారాష్ట్ర)

ఈ పార్కులలో ప్రతి ఒక్కటి పరిశోధనా కేంద్రాలు, పరీక్షా ప్రయోగశాలలు, అధునాతన వస్త్ర పద్ధతులలో కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి నైపుణ్య అభివృద్ధి కేంద్రాai ఆధునిక సౌకర్యాలతో కలిగి ఉంటుంది.

ఈ పార్కుల ప్రయోజనాలు:

ఒక్కొక్క పార్కు వల్ల ప్రత్యక్షంగా లక్ష మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశముంది. దీని ద్వారా ఉత్పత్తి, వ్యాపారం సులువుగా మారనుంది. ఆధునిక, భారీ స్థాయి పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించబడతాయి. పెట్టుబడులు పెరుగుతాయి. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.4,445 కోట్లు. 2021-22 నుంచి 2027-28 వ‌ర‌కు ప‌నులు జ‌ర‌గుతాయి.

పీఎం మిత్ర (PM-MITRA) యోజన పథకం:

దేశంలో వస్త్ర రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రధాన మంత్రి మెగా టెక్స్టైల్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్, అపెరల్ స్కీమ్ (పీఎం మిత్ర) యోజన పథకానికి క్యాబినెట్ 2021లో ఆమోదం తెలిపింది. వస్త్రాల తయారీకి ఒకే చోట స్పిన్సింగ్, వీవింగ్, ప్రాసెసింగ్ / డైయింగ్, ప్రింటింగ్ జరిగే విధంగా సమగ్ర వ్యవస్థను రూపొందించారు.

గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టులు:

గ్రీన్ ఫీల్డ్‌ ప్రాజెక్టు అంటే ఇంతకు ముందు అభివృద్ధి చేయని లేదా ఇలాంటి ప్రయోజనాల కోసం ఉపయోగించని ప్రాంతంలో కొత్త మౌలిక సదుపాయాలు లేదా సౌకర్యాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది.

బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టులు:

బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టులో ఇప్పటికే పట్టణ లేదా పారిశ్రామిక ప్రాంతాలలో నిర్మాణంలో ఉన్న ప్రదేశాలను తిరిగి అభివృద్ధి చేయడం లేదా ఉపయోగించడం జరుగుతుంది.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD